calender_icon.png 18 March, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలగని వీధి లైట్లు

18-03-2025 01:14:45 AM

కల్లూరు, మార్చి 17(విజయక్రాంతి): కల్లూరు మేజరు గ్రామ పంచాయితీ  లోని ప్రధాన రహదారిపై టీటీడీ కళ్యాణ మండపం వద్ద నుంచి ప్రభుత్వ హాస్పటల్ వరకు  గల వీది లైట్ల లేక  ప్రజ లు ఇబ్బంది పడుతున్నారు. రోజులు గడుస్తున్నా వీధి లైట్లు వేయట్లేదని ప్రజలు అంటున్నారు.

గవర్నమెంట్ హాస్పిటల్ వైపు నుండి కల్లూరు సెంటర్ వైపు వచ్చే దారిలో వీధి లైట్లు లేక డివైడర్ కనపడక డివైడర్ పైకి పలు వాహనాలు ఎక్కి ప్రమాదాలు భారిన పడిన సందర్భా లున్నాయి. లైట్లు ఏర్పాటు చేసి, డివైడర్లకు సూచిక బోర్డులు  ఏర్పాటు చెయ్యాలని ప్రజ లు, వాహన దారులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.