calender_icon.png 14 March, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతి లేని బొగ్గు లారీ పట్టివేత

14-03-2025 12:36:05 AM

కర్ణాటక నుంచి సంగారెడ్డికి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ

అనుమతి 100 బస్తాలకు.. తరలింపు 400 బస్తాలు

చౌదర్ పల్లి సమీపంలో పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు 

మహబూబ్ నగర్ మార్చి 13 (విజయ క్రాంతి) : కర్ణాటక నుంచి బొగ్గులోడుతో వెళుతున్న లారీని మహబూబ్ నగర్ రూరల్ మండల్ పరిధిలో చౌదర్పల్లి దగ్గర ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. గత రెండు రోజుల క్రితం ఏ బొగ్గులోడుతో వెళ్తున్న KA 34 B 5389 నెంబర్ గల లారి ని పట్టుకొని ఫారెస్ట్ కార్యాలయంలో సంబంధిత అధికా రులు ఉంచారు. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి బొగ్గులోడుతో సంగారెడ్డి జిల్లాకు వెళుతున్నట్లు సమాచారం అందింది. సమాచారం మేరకు చౌదర్పల్లి దగ్గర దారిని పట్టుకుని విచారణ చేయడం జరిగింది.

లారీ డ్రైవర్ సైతం తెలుగు, హిందీ భాష పై మాట్లాడకపోవడంతో సంబంధిత పత్రాలు చూపించి నప్పటికీ అనుమతులు సక్రమంగా లేవని తేలింది. 100 బస్తాల బొగ్గు తరలించేందుకు కిందిస్థాయి ఫారెస్ట్ అధికారులకు అనుమతి ఉన్నప్పటికీ దాదాపు 400 బస్తాలలో బొగ్గు లారీలో తరలించారు. ఆ రాష్ట్ర ఫారెస్ట్ ఉన్నత అధికారులకు అనుమతి ఇచ్చేందుకు అవకాశం ఉన్న ఉన్నతాధికారుల అనుమతులు లేవు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో పత్రాలను పరిశీలించి సంబంధిత లారీపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంపై విచారణ చేస్తున్నట్లు డిఎఫ్‌ఓ సత్యనారాయణ తెలియజేశారు.