calender_icon.png 1 April, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలలో సృజనాత్మక శక్తిని వెలికితీయాలి

26-03-2025 01:17:51 AM

  1.  కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో రోబోటిక్ ఎక్స్పో-2025 
  2.  జిల్లా విద్యాశాఖ అధికారి పార్టీ అశోక్ 

నిజామాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): పిల్లలలోని సృజనాత్మక శక్తిని వెలికి తీస్తే దేశ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావి తరాల్లో వారు సమాజానికి తమ వంతు విస్తృత సేవలు అందిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి పార్టీ అశోక్ అన్నారు.  మంగళవారం రోజు కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో ఏర్పాటు చేసిన టెట్రానికా రోబోటిక్ ఎక్స్పో 20 25 నిర్వహించారు. 

ఈ ఎక్స్పో కార్యక్రమంలో కాకతీయ స్కూల్ విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. వివిధ అంశాల్లో విద్యార్థులు తయారుచేసిన సాంకేతిక పరిశోధనలను ప్రదర్శించారు. ఈ సాంకేతిక ప్రదర్శనను విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యాశాఖ అధికారి కూడా సందర్శించారు పిల్లలు తయారుచేసిన వివిధ అంశాల గురించి క్షుణ్ణంగా వారిని అడిగి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అని తెలుసుకున్నారు భవిష్యత్తులో ఈ చిన్నారుల మేధస్సుకు మరింత పదం పెడితే ఎంతగానో ఉపయోగ ఉంటుందన అశోక్ అన్నారు వ్యవసాయ సాంకేతిక విద్యా తో పాటు విద్యార్థుల చురుకుదనం

ఈ కార్యక్రమాలపైనే ఆధారపడి ఉంటుందని ఇలాంటి విద్యను కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో పిల్లలకి అందించడం చాలా గర్వకారణం అని. అశోక్ పాఠశాల యజమాన్యం అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లాలో జరగడం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

కాకతీయ ఒలంపియాడ్ డైరెక్టర్ తేజశ్రీని మాట్లాడుతూ పాఠశాలకు విచ్చేసి చిన్నారులు ప్రదర్శించిన వివిధ అంశాలను తిలకించి విద్యార్థులకు పలు సూచనలు చేసినందుకు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్లు తేజస్విని సిహెచ్ రాజ సిహెచ్ రామోజీరావు ప్రిన్సిపాల్ పివి నటరాజ్ కోఆర్డినేటర్ సునీత రోబోటిక్ హెచ్ ఓ డి సదానంద్ అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.