calender_icon.png 25 January, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తుతెలియని వాహనం ఢీ

25-01-2025 01:14:55 AM

యువతి మృతి భర్తకు తీవ్ర గాయాలు 

మానకొండూర్ జనవరి 24: ద్విచక్ర వాహనంపై కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్న వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువతి క్రిందపడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ సమీపంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఎల్ ఎం డి ఎస్ ఐ వివేక్ కథనం మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన శ్రీనివాస చారి తన భార్య గౌతమి,2 పిల్లలతో కలిసి స్కూటీ ద్విచక్ర వాహనం టీఎస్ 02 ఎఫ్,బి,6995 కరీంనగర్ నుంచి అన్నారం వెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గౌతమి 30, క్రిందపడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాస్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లలకు మాత్రం ఎలాంటి గాయాలు కాకపోవడంతో సృష్టితంగా బయటపడ్డారు. మృతురాలి భర్త శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు.