calender_icon.png 20 March, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్ధరాత్రి ఆటోను తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

17-03-2025 12:00:00 AM

కోయిలకొండ మార్చి 16 : ఇంటి ముందల ఆపుకున్న ఓ వ్యక్తి ఆటో అర్ధరాత్రి అంటి పెట్టిన దృశ్యం చోటుచేసు కుంది. బాధితుడు గంగాధర్ స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాది కోయిలకొండ మండలం మల్లాపూర్ గ్రామం. రోజు మాదిరిగానే  ఆటో తోలి నా ఇంటి ముందల ఉంచడం జరిగింది. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి అంటి పెట్టినట్లు తెలుస్తుంది.

అర్ధరాత్రి మేలుకోవచ్చు బయటకు వచ్చి చూస్తే అప్పటికే ఆటో తగలబడి కనిపించింది. బతుకుదెరువు కోసం తెచ్చుకున్న ఆటోను ఇలా తగలబెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని కోయిలకొండ పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై ఎస్త్స్ర నీ వివరణ కోరగా ఫిర్యాదు చేసింది నిజమేనని పూర్తి వివరాలు దర్యాప్తు చేసి వెల్లడిస్తామని పేర్కొన్నారు.