calender_icon.png 11 January, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె ప్రకృతి వనానికి నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు

31-12-2024 06:43:51 PM

మనోహరాబాద్ (విజయక్రాంతి): గుర్తుతెలియని దుండగులు పల్లె ప్రకృతి వనానికి నిప్పంటించిన సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం మేజర్ గ్రామపంచాయతీ కాళ్లకల్ గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో చోటుచేసుకుంది. గ్రామంలో సుందరీకరంగా పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి పలు రకాల విలువైన ఔషధ మొక్కలతో పాటు పువ్వుల, పండ్ల మొక్కలను పెంచుతూ సుందరంగా తీర్చిదిద్దారు. మంగళవారం గుర్తు తెలియని దుండగులు ప్రకృతి వనానికి నిప్పంటించగా విషయం తెలుసుకున్న స్థానిక కార్యదర్శి రాజు తమ సిబ్బంది కరోబార్ బాలకృష్ణారెడ్డి, శేషు, సిబ్బంది స్వామి, తిరుపతి, సఫాయి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ప్రకృతి వనంలో చెలరేగుతున్న మంటలను బోరు మోటార్ల నీటి సహాయంతో మంటలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కార్యదర్శి హెచ్చరించారు.