calender_icon.png 5 November, 2024 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రీత్ అనలైజర్ కేసుల్లో అన్యాయంగా శిక్ష

03-11-2024 12:00:00 AM

ఎండీకి ఫిర్యాదు చేసిన ఆర్టీసీ యూనియన్ నేతలు 

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులను బ్రీత్ అనలైజర్ కేసులతో అన్యాయంగా శిక్షిస్తున్నారని ఆర్టీసీ కార్మిక సంఘం ఎస్‌డబ్ల్యూఎఫ్ శనివారం ఆర్టీసీ ఎండీకి ఫిర్యాదు చేసింది. మద్యం సేవించారా? లేదా? అని బ్రీత్ అనలైజర్‌తో పరీక్ష చేసినప్పుడు 30ఎంజీ/100ఎంఎల్ దాటిన కేసుల్లో మాత్రమే శిక్ష వేయాలని, కానీ 1ఎంజీ వచ్చినా సస్పెండ్ చేసే విధానాన్ని విడనాడాలని ఇచ్చిన వినతిపత్రంలో సంఘం ప్రతిని ధులు వీరాంజనేయులు, వీఎస్‌రావు కోరారు.

దగ్గుమందు, హోమియో మాత్రలు వేసుకున్నా పరీక్షలో 4ఎంజీ నుంచి 12ఎంజీ రీడింగ్ చూపిస్తోందన్నారు. 2015లో న్యాయశాఖ ఇచ్చిన సర్క్యూలర్‌ను సవరించి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.