26-02-2025 01:16:50 AM
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో లైఫ్ సెన్సైస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పరిశ్రమల భాగస్వామ్యంతో సైన్స్ అండ్‌టెక్నాలజీలో ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసేలా కోర్సులకు రూపకల్పన చేయబోతున్నామన్నా రు.
లైఫ్ సెన్సైస్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి ప్రపంచ పటంలో రాష్ట్రాన్ని ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లిందన్నారు. లైఫ్ సెన్సైస్ రంగంలో తెలంగాణను నంబర్ వన్‌గా మార్చడంలో జీనోమ్ వ్యాలీ కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. ‘హార్ట్ ఆఫ్ ది లైఫ్ సెన్సైస్’ జీనోమ్ వ్యాలీని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు.
ఉపాధి కల్పనలో లైఫ్ సెన్సైస్ రంగం కీలక పాత్ర పోషి స్తు న్నట్లు వెల్లడించారు. ప్రత్యక్షంగా 51వేల మం దికి, పరోక్షంగా 1.5 లక్షల మంది ఉపాధి పొం దుతున్నారని, స్కిల్ యూనివర్సిటీ ద్వారా లైఫ్ సెన్సైస్ పరిశ్రమలకు అవసరమైన నైపు ణ్య మానవ వనరులను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
పరిశ్రమల ఏర్పాటుకు అనుకూ లంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞ ప్తి చేస్తున్నామన్నారు.ఈ ఏడాది దావోస్ పర్యటనలో తెలంగాణలో రూ.1.80 లక్షల కో ట్లు పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నామని, పారిశ్రామికవేత్తలకు తెలంగాణపై ఉన్న నమ్మకంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై ఉన్న భరోసాను చాటి చెప్పేందుకు ఈ ఒక్కటి చాలని చెప్పారు.
పరిశ్రమల ఏర్పాటుతోనే ఆగిపోం..
తమ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుతోనే ఆగిపోదని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. యూనివర్సిటీలు, స్టార్టప్‌లను పరిశోధన సం స్థలతో భాగస్వామ్యం అయ్యేలా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఎంఎస్‌ఎంఈలను ప్రో త్సహించి లైఫ్ సెన్సైస్ రంగాన్ని మరింత వృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న జనరిక్ మందులు, వ్యాక్సీన్లలో తెలంగాణ వాటా రోజురోజుకీ పెరుగుతోందని, 200కు పైగా దేశాలకు ఏటా 5 బిలియన్ డాలర్ల విలువైన మన ఫార్మా ఉ త్పత్తులు ఎగుమతి అవుతున్నాయని, ఏఐ, క్వాంటం, రోబోటిక్స్ తదితర నూతన టెక్నాలజీ సాయంతో రోగుల అవసరాలకు అను గుణంగా, వారికి త్వరగా స్వాంతన చేకూరేలా ఔషధాల సామర్థ్యాన్ని పెంచే పరిశోధనలపై ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు.
15 బిలియన్ డాలర్ల పెట్టుబడి వ్యయంతో మౌలిక సదుపాయాల పరంగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రపంచ దిగ్గజ ఫార్మా కంపెనీలు తెలంగాణలో తమ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్, ఆర్‌అండ్‌డీ, జీసీసీలను ప్రారంభించాయన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా -క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ, యూకేకి చెందిన ఎన్‌హెఎస్, టీహబ్‌తో ఎంవోయూ చేసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
గ్రాన్యూయల్స్, భారత్ బయోటెక్, ఆజియంట్, బయోలాజికల్ బీఈ తదితర దేశీయ, విదేశీ దిగ్గజ ఫార్మా సంస్థలతో ఒప్పందాలు చేసుకోబోతున్నామని వెల్లడించారు. అసోసియేషన్ ఆఫ్ కాంట్రాక్టు రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యనుఫాక్చరింగ్ ఆర్గనైజేషన్స్(సీఆర్డీఎంవో) తన ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతోందని, రాష్ర్ట ప్రభుత్వం తరఫున వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి చెప్పారు.
బయో ఆసియా సదస్సు ప్రారంభ కార్యక్రమంలో క్వీన్స్ ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జన్నెట్టెడ్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇండస్ట్రీస్ విభాగం డైరెక్టర్ మన్సూర్, తదితరులు పాల్గొన్నారు.