calender_icon.png 22 March, 2025 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనివర్సిటీ భూములను కాపాడాలి

22-03-2025 12:40:38 AM

కొత్తపల్లి, మార్చి 21 (విజయ క్రాంతి):  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని,విద్యార్థుల హక్కులను కాల రాసేవిధంగా జీవోలు జారీ చేశారనీ వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ  ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం శాతవాహన యూనివర్సిటీ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్, జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, యూనివర్సిటీ ఇన్చార్జ్ కిరణ్మయి, కార్యదర్శి సాగర్, పూజ, నగర కార్యదర్శి భామండ్ల నందు, జోనల్ ఇన్చార్జ్ విష్ణు విగ్నేష్, యోగేష్, అనూష గౌరీ, ప్రియ, మానస, తదితరులు పాల్గొన్నారు.