గ్రూప్ ఫోర్ పరీక్షల్లో ఉద్యోగాన్ని సాధించిన పేట్ సంగేమ్ వాసి
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పేట్ సంగేమ్ గ్రామానికి చెందిన కూచి హనుమండ్లు భారతిల పెద్ద కుమార్తె సౌమ్య ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపిక శిక్షణ పొందుతుంది. గ్రూప్ ఫోర్ పరీక్షలు కూడా రాసింది. ఇటీవల ప్రకటించిన ఫలితాలలో ఆమెకు ఉద్యోగం లభించింది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో క్లర్కుగా నియామక పత్రం అందుకుంది. మారుమూల గ్రామానికి చెందిన సౌమ్య వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు స్థానికంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదివారు. వ్యవసాయదారులైన తల్లిదండ్రులు కష్టపడి చదివించారు.
తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలని తాపత్రయంతో సౌమ్య పాఠశాల స్థాయిలోనే క్రీడల పట్ల మక్కువ పెంచుకుంది. లక్ష్మణ్ ప్రోత్సహంతో పలు క్రీడ పోటీల్లో పాల్గొని గెలుపొందింది. వాలీబాల్ క్రీడాకారునిగా రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభను చాటింది. సౌమ్యకు పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం రాగా హైదరాబాదులో శిక్షణ పొందుతుంది. గ్రూప్ ఫోర్ పరీక్ష రాయడంతో అందులో కూడా ఉద్యోగం లభించింది. సౌమ్య ఎంతో కష్టపడి రెండు ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.