03-04-2025 12:00:00 AM
కొత్తపల్లి, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అన్యాక్రంతం అవుతున్నాయని, విద్యార్థుల హక్కులను కాల రాసేవిధంగా జీవోలు జారీ చేశారనీ వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీల భూములు పూర్తిగా కబ్జాలకు గురి అవుతున్నాయని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలను ఆక్రమించి కార్పొరేటీకరణ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంచర్లు వేసి సొమ్ము చేసుకోవాలని చూస్తుందన్నారు.
యూనివర్సిటీ భూములను విషయంలో విద్యార్థులు ప్రశ్నిస్తున్న నేపంలో విద్యార్థులపై లాటిచార్జి చేయించడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యసమితి సభ్యులు కిరణ్మయి, జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, యూనివర్సిటీ అధ్యక్షులు బాలకృష్ణ, సాయి, అనూష, గౌరీ, ప్రియ,మానస, తదితరులు పాల్గొన్నారు.