calender_icon.png 26 March, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్సిటీలు భావ సంఘర్షణ కేంద్రాలు

23-03-2025 12:09:44 AM

  1. ఓయూ సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలి
  2. రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22 (విజయక్రాంతి): విశ్వవిద్యాలయాలు భావ సం ఘర్షణ కేంద్రాలని పలువురు వక్తలు అన్నా రు. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలను నిషేధిస్తూ ఇటీవల ఇచ్చిన సర్క్యులర్‌పై ఉస్మానియా, విప్లవ విద్యార్థి సంఘం పూర్వవిద్యార్థులు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.

డేవిడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అ ల్లం నారాయణ, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కే శ్రీనివా స్, సీనియర్ జర్నలిస్టు అమర్, కవి నందిని సిదారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ మాజీ జాతీయ నా యకుడు స్టాలిన్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెవి చలపతి రావు, పీడీఎస్‌యూ జాతీయ నాయకుడుపి మహేష్ పాల్గొని మాట్లాడారు. సామాజిక చైతన్యానికి ఓయూ ఒక కదలిక అన్నారు. అని చెప్పారు. ఓయూలో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 70 శాతం అధ్యాపకులు లేరని, ఆర్ట్స్ కాలేజీ స్మశానా న్ని తలపిస్తోందని విమర్శించారు.