calender_icon.png 1 April, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవోదయ ఫలితాల్లో మెరిసిన యూనివర్సల్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు

27-03-2025 12:00:00 AM

ఇబ్రహీంపట్నం, మార్చి 26 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నవోదయ విద్యాలయ ఫలితాల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని యూనివ ర్సల్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. నవోదయ విద్యాలయ విడుదల చేసిన ఫలితాల్లో యూనివర్సల్ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ పొందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను చాటుకున్నారని యూనివర్సల్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఎ బాలరాజ్ తెలిపారు.

మొత్తం యూనివర్సల్ కోచింగ్ సెంటర్ నుంచి 14 మంది విద్యార్థులు నవోదయ విద్యాలయాల ఉచిత విద్యకు ఎంపికయ్యారని తెలిపారు. యూనివర్సల్ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ పొందిన ఎం.అక్షర, మైతిలి, శ్రీలక్ష్మిప్రియ, లాస్య, తేజశ్రీ, యష్విత, సాయిప్రణవి, కె.అక్షర, రోహన్ కుమార్, శ్రీకర్, సాయిచరణ్, అశ్విన్, అనిరుద్, కుషాల్ కుమార్ లు ఉత్తమ ప్రతిభ కనబరిచి సీట్లు సాధించారు.

నవోదయ విద్యాలయ ఫలితాల విడుదల అనంతరం బుధవారం ఇబ్రహీంపట్నం యూనివర్సల్ కోచింగ్ సెంటర్ లో సీట్లు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ ఎ బాలరాజ్ శాలువాలతో ఘనంగా సన్మానిం చారు.  వివరాలకు సంప్రదించాలని యూనివర్సల్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ బాలరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధనంజయ్, విష్ణు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.