calender_icon.png 30 April, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్మూర్‌లో ఐక్యతా ర్యాలీ

30-04-2025 01:15:01 AM

  1.  చలో ఆర్మూర్ గౌడన్నల పిలుపు 
  2. వీడీసీ ఆగడాలను అరికట్టాలి 
  3.  తాళ్ల రాంపూర్‌లో గౌడ మహిళలను ఆలయ బహిష్కరణ చేసిన వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలి 

ఆర్మూర్, ఏప్రిల్ 29: ఆర్మూర్ పట్టణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల ఐక్యతా ర్యాలీ సందర్భంగా చలో ఆర్మూర్ కార్య క్రమం నిర్వహించారు. ‘బీసీ జన సభ’. అనంతరం అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, బీసీ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో వి డి సి ఆగడాలు రోజుకు మితిమీరుతున్నయని తాళ్ల రాంపూ ర్ గ్రామంలో ఇటీవలే పవిత్రమైన రామాలయంలో కుంకుమ పూజకు వెళ్లిన 11 మంది మహిళలను వి డి సి ఆలయ బహిష్కరణ చేయడం అవమానకరమని మహిళల గౌరవాన్ని కించపరిచినట్టు ఉందని తక్షణమే విడిసి పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ సంఘటన జరిగి ఎన్ని రోజులు గడిచిన అధికారులు గానీ ప్రభుత్వం గానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని ప్రభుత్వం అధికారులు ఉన్న లేని కిందికి అని విమర్శించారు అలాగే ఇటీవల యాదవులకు, రజకులకు కూడా ఇలాగే విడీసీలు గ్రామం గ్రామాల్లో బీసీ కుల వృత్తుల వారిపై ఆంక్షలను విధిస్తున్నారని అగ్రకులాలు బీసీ ఎస్సీ ఎస్టీ కులాలపై దౌర్జన్యం చేస్తూ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని వీటిని ఆపకుంటే రాజ్యాంగానికి పెద్ద దెబ్బ అని బీడీసీ చేస్తున్న ఆగడాలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు 15 రోజులలో వి డి సి లపై చర్యలు చేపట్టకుంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు నిర్వహిస్తామని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు  

జేఏసీ నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో బీడీసీలు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయ ని తాము చెప్పింది వేదమని వీడీసీల ఇచ్చిన తీర్పులను ఉల్లంఘిస్తే లక్షల రూపాయల్లో జరిమానాలు విధిస్తాం గ్రామ బహిష్కరణ చేస్తాం అని భయభ్రాంతులకు గురిచేసి అమాయక ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారని చట్టరీత్య వీడీసీలకు ఎలాంటి అధికారులు లేవని కాబట్టి రాష్ర్ట ప్రభుత్వం ,జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ లు వి డి సి లపై చర్యలు చేపట్టి వీడీసీ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో రానున్న రోజుల్లో భయంకరమైన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఆలయ బహిష్కరణ అయిన గౌడ మహిళలు మాట్లాడుతూ సమాజంలో మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవ స్థానం ఉందని అలాంటి మహిళలను కించపరుస్తూ ఆలయ బహిష్కరణ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆలయ బహిష్కరణ చేసిన వి డి సి లపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు.

గౌడ కులం నుంచి విడీసీకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు, విలేజ్ డెవలప్మెంట్ కొరకైతే విలేజ్ లో ఉన్న అన్ని కుల సంఘాల నుండి పైసలు తీసుకోవాలి కానీ కేవలం గౌడ్లను డిమాండ్ చేసి పైసలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు, పైసలు ఇవ్వకపోతే  కళ్ళు త్రాగకుండా గ్రామస్తులకు అర్థాలు పెట్టడం ఎవరైనా తాగితే 25 వేల రూపాయలు జరిమానా విధిస్తామని వీడిసి హుకుం జారీ చేశారని గ్రామస్తులు తాగకపోగా వేరే గ్రామస్తులు వచ్చి తాగిన వారు కూడా కళ్ళు తాగారాదని నిషేధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు గత ఆరు నెలలుగా ఈ సమస్య కొనసాగుతున్న ఇటు ప్రభుత్వం గాని ఆటు అధికారులు గానీ నిమ్మకు నేరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నారని తక్షణమే వీడీసీలను రద్దుచేసి ప్రజా ప్రభుత్వ పాలనను తీసుకురావాలని కోరారు. లేనిపక్షంలో 15 రోజుల అనంతరం పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీస్తామని రాష్ర్ట ప్రభుత్వానికి, అధికారులను హెచ్చరించారు.