calender_icon.png 17 March, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమైక్య అద్వుతై ధార

16-02-2025 12:00:00 AM

శంకరులు బిల్వవృక్షం. ఆయన నుండి జారిన ఒక్కొక్క శ్లో కం ఒక్కొక్క దళం. అది ధవళం, సరళం, శాప పాప తాప హరణం. కైవల్య కార ణం. శంకర భగవత్పాదులు రచించిన ‘భజగోవిందం’ ఎన్ని గళాలలో ప్రవచనమై, ఎన్ని కలాలలో వ్యాఖ్యానమై, అర్థమై, సమర్థ సమన్వయ బోధయై ఈ ప్రపంచంలో ఆవిష్కృతమైందో లెక్కలేదు.

కాలం, సంస్కృతి, విలువలు, ఆయా దేశాలలో, జాతులలో విభిన్నంగా, వినూత్నంగా, విచిత్రంగా రూపాంతరం చెందు తున్నపుడు భగవత్పాదుల భజగోవిందం మనకు అక్కరవుతున్నది.

మానవ జీవి తం మీద, జీవన విధానం మీద, జీవన దృక్పథం మీద సనాతన, సనూతన, సమగ్ర వ్యాఖ్యగా, బోధగా, కాలాధ్యవచ్చిన్నంగా నిలిచిన, సప్రమాణిక ఉద్గీత! వారు వ్రాయని భాష్యం లేదు, గీతిక లేదు, స్తోత్రం లేదు.

సర్వ దేవతాగుణాల సమన్వయ స్వరూపంగా మతాతీతమైన సరళభావనగా అద్వైతాన్ని ప్రతిపాదించి, భారతీయ ఆత్మను మహోజ్వలమణిగా వెలిగించిన తేజోరూపమే శంకరులు.

పరమ కరుణాలయంగా గురుశిష్య పరంపరను, శృతి స్మృతుల వ్యాఖ్యాతగా ఆచార్యత్వాన్ని, దైవం పట్ల అచంచల విశ్వాసాన్ని, దైవీశక్తులపట్ల నిర్ద్వంద్వమైన నమ్మకాన్ని, నామ, రూప, భావాతీతమైన తత్త్వాన్ని అరచేతిలో అమలకంగా అనుగ్రహించిన సరస్వతీ స్వరూపం శంకరులు.

ఎన్ని సిద్ధులున్నా వాటిని సమాజ హితం చేసి, ఎంత జ్ఞాన స్వరూపమైనా వినయమూర్తిగా నిలచి, సాక్షాత్తు శివ స్వరూప మైనా ఈ లోకంలోనే సాలోక్య, సామీ ప్య, సాన్నిధ్యంగా నిలచి, సాయుజ్య మార్గోపదేశనం చేసి, పరమహంస, పరివ్రాజక, సన్యాస స్థితులను తేటతెల్లం చేసిన పురాణ పురుషులు శంకరులు.

మాట, పాట, నడక, నడత అంతా సత్యబోధగా సాగిన శంకరావతారం సత్యాచా ర్య స్వరూపం. సమన్వయమే కాని సంఘర్షణకు తావు లేని భావధార శంకరులది. తమ రాకకు ముందున్న భావ సంపదలను పరిష్కరించి, వాటికి హేతుబద్ధత కల్పించి, పూర్ణవాదంగా తీర్చిదిద్దిన భావ నా శిల్పి శంకరులు.

శంకర వాఙ్మయమూ శంకరులూ భిన్నం కాదు. జీవుడూ, దేవు డూభిన్నం కాదు. దేహం ఆత్మ భిన్నం కాదు. జనన మరణాలు చీకటి వెలుగులూ, దివారాత్రా లు భిన్నం కావు. అవి రెండుగా కనిపించే ఒకే సంగతి. రెండోదంటూ మరొకటి లేదు. ఉన్నదొకటే. అదే ఆత్మ! అందరిలో అంతటా ఉన్నది అదే. శూన్యం పూర్ణం ఒకటే. అవి రెండు స్థితులు. అంతే!

కాలడి నుండి కేదారం వరకు సాగిన 32 సంవత్సరాల శంకర అవతార ప్రవా హం భారతీయ చరిత్రలో ఒక అపురూప సన్నివేశం. పూర్ణా నదీతీరంలో ప్రారంభమై హిమాచల సానువులలో సమైక్యమై న అద్వైతధార. దేశం ఒకటే.

దిక్కులు గా జరిగిన విభజన మనిషి చేసుకున్న దే. అద్వైతమే అచలం. ద్వాపరలో వ్యాసు డు తొలి లోక గురువు. ఆ యుగంలోనే యోగీశ్వర కృష్ణుడు తొలి జగద్గురువు. కలియుగంలో శంకర భగవత్పాదులు ఆదిశంకరులు జగద్గురువులు. శ్రీ శంకర స్మృతి, నిత్యం సత్యం శాశ్వతం.

అద్వైతామృతధార కురియ అంతరంగమనెడి పాత్ర తెరచి వుంచు బోర్లించి వుండగా బొట్టైన చిక్కదు తెరచి వుంచిన చాలు తరచనగును.

శంభోర్మూర్తిః చరతి భువనే శంకరాచార్య రూపా!