* అధికార పార్టీలో చర్చనీయాంశంగా విభేదాలు
* వస్తున్న ఎన్నికలకు మరింత ఫోకస్ కావాల్సిందే
* ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి చేస్తామంటున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
మహబూబ్ నగర్, జనవరి ౭ (విజయ క్రాంతి): అభివృద్ధి జరగాలన్నా.... సమస్యలు పరిష్కారం కావాలన్నా... ఐక్యత తన ప్రత్యేక తను చాటుకుంటుంది. అప్పుడే అభివృద్ధి బాటలో ఏ పనిని సంకల్పించిన విజయతీ రాలకు చేర్చుతుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్‌ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రె స్‌ను విజయతీరాలకు చేర్చిన విషయం అందరికీ విధితమే. గడిచిన పది సంవత్స రాలు నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఎప్పటికైనా తమ పార్టీ అధికారంలోకి వ స్తుందనే సంకల్పంతో ఎంతో మంది నాయ కులు ఉన్నారు.
గడిచిన అసెంబ్లీ, పార్లమెం ట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ లో కీలకంగా పనిచేసిన నాయకులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ తరుణంలో పది సంవ త్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు మ హబూబ్‌నగర్ తీర చర్చకు దారి తీస్తున్నారు.
ప్రజా సంక్షేమంపై పట్టు విడవని విక్రమా ర్కుడిలా శ్రమిస్తున్నా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాసరెడ్డి కి కొందరు నాయకులు అనవసర తలనొప్పులు తీసుకు వస్తుండ్రు. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతూ కాంగ్రెస్ పార్టీ లో లొల్లి జరిగిందంట అనే తీవ్ర చర్చకు కేరాఫ్‌గా కొందరు నాయకులు నిలబడు తుండ్రు.
వస్తున్నా ఎన్నికలకు కాంగ్రెస్ లోని నాయకులే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల్లో చర్చకు కారణమవు తుంటే మరి ఎన్నికల సమయంలో ఈ చర్చ మరింత లేవనెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విషయాలు అన్నియు ప్రతిపక్ష పార్టీల నేతలు లేవనెత్తి ప్రజల మెప్పు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సొంత పార్టీ నేతల్లోనే గొడవ...
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ వాతావరణం ఎక్కువగా ఉంటుందని, ఎవరు ఏదైనా మాట్లాడుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కల్పించడం జరుగుతుందని కాంగ్రెస్ పెద్దలు నిత్యం చెబుతున్న మాట. కాగా స్వేచ్ఛ ఎక్కువగా ఉండడం మంచిదే అనుకుంటున్న జనానికి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి జనసంద్రంగా ఉండే ప్రదేశాల్లోనూ గొడవలు పడుతుంటే ఎందుకు ఒకే పార్టీలో ఉన్నవారు గొడవలు పడుతున్నారనే చర్చ పట్టణంతోపాటు పాలమూరు అంతా పాకు తుంది.
గతంలో క్యాంపు కార్యాలయంలో నాయకులు గొడవపడ్డారని ఓ న్యూస్ వైరల్ అయింది. ఇటీవల బస్టాండ్ సమీపంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు గొడవపడ్డారు.
ఈ విషయంపై ఇరువురు పోలీసు మెట్లు ఎక్కిండ్రు. ఈ అంశాలను వాకర్స్ నుంచి వివిధ జనసంద్రంగా ఉండే ప్రదేశాలలో పట్టణవాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు కొట్లాడుతున్నారని ఇలా కొట్లాడితే ఎలా అంటూ ప్రత్యేకంగా పట్టణ వాసులు చర్చించుకుంటుండ్రు.
ఈ చర్చ ఇలాగే కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆసహనం వ్యక్తం చేస్తున్న నేతలు కారణమైతే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. జరగబోయే ఎన్నికల్లో ఏదై నా నష్టం జరిగితే ఈ గొడవలు కూడా కారణంగా అవకాశాలు ఉండనున్నాయని పట్టణంలోని పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా చర్చించుకుంటుండ్రు.
పార్టీలో ప్రశాంతత కావాల్సిందే...
కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అందిస్తుందని చెబుతున్న మాట ను నిజం చేయాలంటే పాలమూరు నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముం దుకు వచ్చిన అవసరం ఎంతైనా ఉంది. జరగనున్న ఎన్నికల్లో పార్టీని మరో మరు విజయతీరాలకు చేర్చాలంటే కాంగ్రెస్ నాయకుల్లో ప్రశాంతత కావల్సిందే.
కారణా లు ప్రజలకు పూర్తిస్థాయిలో తెలియనప్పటికీ కాంగ్రెస్ నాయకులే గొడవ పడుతున్నారనే విషయాలు బయటకు పోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ గొడవే చర్చనీయాంశం అవు తుంది. ఇప్పటికైనా పార్టీ నిర్ణయాలు కట్టుబ డి ఉండి, కొత్త పాత అనే భేదం లేకుండా ముందుకు సాగుతూ గొడవలకు తావివ్వ కుండా అడుగులు వేస్తే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయతీరాలకు చేరే అవకాశం ఉందని పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు పేర్కుంటుండ్రు.