30-03-2025 10:04:07 PM
కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి (విజయక్రాంతి): పండుగలు ఐకమత్యాన్ని పెంచుతాయని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం కామారెడ్డి వీక్లీ మార్కెట్లో సదర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎడ్లబండ్ల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కుల మతాలకతీతంగా ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకోవడంలో కామారెడ్డికి మంచి చరిత్ర ఉందన్నారు. స్నేహపూర్వకంగా పండుగలను జరుపుకోవాలని సూచించారు. పంచాంగ శ్రవణాన్ని వినిపించిన పేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సదర్ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ అలంకరణ చేసిన ఎడ్లబండ్ల కు జ్ఞాపికలను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సదర సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదర్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.