హైదరాబాద్‌లో 5 బ్రాంచీలతో ప్రారంభం
హైదరాబాద్( విజయ క్రాంతి): యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్( యూనిటీ బ్యాంక్) తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా తొలుత హైదరాబాద్‌లోఐదు శాఖలను ప్రారంభించింది. ఈ శాఖలను దిల్‌సుఖ్‌నగర్, ఎస్‌ఆ ర్‌నగర్, మౌలాలి, సుచిత్ర క్రాస్‌రోడ్స్, కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసినట్లు యూనిటీ బ్యాంక్ ఎండీ,సీఈఓ ఇంద్రజిత్ కమోత్రా తొలిపారు. రాన్ను రోజుల్లో హైదరాబాద్‌లో మరో మూడు శాఖలతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడల్లో శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడానికి ఈ దీపావళి నాటికి క్రెడిట్ కార్డు విభాగంలోకి అడుగుపెట్టడంతో పాటుగా వ్యక్తిగత రుణాలను అందుబాటులోకి తేనున్నట్లు ఇంద్రజిత్ తెలిపారు.