calender_icon.png 16 March, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెకెఓసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐఖ్య పోరాటాలు అవసరం..

15-03-2025 08:09:12 PM

కెఓసి ఫిట్ మీటింగ్ లో ఎఐటియుసి నాయకులు..

టేకులపల్లి (విజయక్రాంతి): ఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆద్వర్యంలో టేకులపల్లి మండలం కోయగూడెం ఓసిపిలొ శనివారం ఉదయం షిఫ్ట్లో ఫిట్ మీటింగ్ నిర్వహించారు. బాణొత్ బాలాజీ అద్యక్షతన జరిగిన సమావేశంలో వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె సారయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎండీ నజీర్ అహ్మద్ లు మాట్లాడారు. ఇల్లందు ఏరియా మనుగడకు ఐఖ్య పోరాటాలు అవసరమని జెకెఓసి విస్తరణ ప్రాజెక్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు అవసరమని అందుకు ఎఐటియుసి కార్యాచరణకు పూనుకుంటుందని తెలిపారు.

రాజకీయ జోక్యం వలన సింగరేణి పరిస్థితి ఆగమ్యగొచరంగా మారిందని, గత బిఆర్ఎస్ పద్దతిలో కాంగ్రెస్ నడుస్తోందని డిఎంఎఫ్, సిఎస్ఆర్ తదితర నిధులు దుర్వినియోగం అవూచున్నాయని దుయ్యబట్టారు. యాజమాన్యం ఎమ్మెల్యేలకు లోకల్ లీడర్లుకు దాసోహం అంటున్నారని, కోడా ఆఫ్ డిసిప్లెన్ మరిచారని గుర్తింపు, ప్రాతినిధ్యం సంఘాల తొ చర్చించకుండా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఈ నేల 7,8 తేదీలలో సిఅండ్ఎండి స్థాయిలో జరిగిన మీటింగ్ నందు ఉద్యోగుల సంక్షేమంలొ భాగంగా సొంత ఇంటి పథకం, వడ్డీ లేని రుణం, కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు, ఎన్-1 ప్లేడే పద్దతి ఎత్తి వేయాలని, ప్రస్తుతం వున్న జనరల్ మజ్దూర్, బదిలీ వర్కర్ల పేర్లను మార్చి జనరల్ అసిస్టెంట్ గా చేయాలని, పేరేక్స్ పై ఇంకంటాక్స్ కోలిండియా మాదిరిగా సింగరేణి కార్మికులకు రీఅంబర్స్మేంట్ చేయాలని తదితర అంశాలపై యాజమాన్యంతొ పూర్తి స్థాయిలో మాట్లాడడం జరిగిందని తెలిపారు.

అందుకు యాజమాన్యం సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కరిస్తామని అన్నారని తెలిపారు. ఈ సమావేశంలో బ్రాంచ్ ఉపాద్యక్షులు దాసరి రాజారాం, కెఓసి ఫిట్ సహయ కార్యదర్శులు షెక్ సర్వర్, బానొత్ బాలాజీ, షిఫ్ట్ ఇంచార్జిలు సద్దాత్ హుస్సేన్,కరుణ శంకర్, సామల శ్రీనివాస్, శ్యామ్ సుందర్, బాలుకుమార్, రాజ్ కుమార్,షేక్ ఇబ్రహీం, బండి సీతారాములు, కనకరాజు, వేంకటనర్సయ్య, ఉమేష్ కుమార్, అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.