28-04-2025 04:26:46 PM
నిర్మల్ (విజయక్రాంతి): కార్మికులకు ఆలు కలిగించే చట్టాలు ఎన్ని తీసుకువచ్చిన వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వాలపై పోరాటం చేద్దామని కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని పెన్షనర్ల కార్యాలయంలో సమావేశం నిర్వహించి వచ్చే నెల ఒకటిన నిర్వహించి మే డే కార్మికుల దినోత్సవ విజయవంతం చేయడంపై చర్చించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని కార్మిక సంఘాల నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బాల మృతి విలాస్ రాజన్న రాజు మహిముద్ విశాల్ రమేష్ గంగన్న లక్ష్మి ఇతరులున్నారు.