calender_icon.png 2 January, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులను మోసగించి కార్పొరేట్ల కడుపు నింపడానికే ఏకీకృత పింఛన్ విధానం

30-12-2024 10:03:02 PM

సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ...

పాపన్నపేట: ఉద్యోగులను మోసం చేస్తూ కార్పొరేట్ల కడుపు నింపడానికి ఏకీకృత పింఛన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తుందని సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి 2025 నుండి ఏకీకృత పింఛన్ విధానాన్ని అమలు చేసేందుకు గాను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ విధానం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం ఏర్పడిందని ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ విధానాన్ని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏకీకృత పింఛన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాన్ని ఈ సందర్భంగా ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా కోశాధికారి చంద్రం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాజేష్ తో పాటు సాజిద్, దేవయ్య, శ్రీనివాస్ గౌడ్, కిషన్, మాధవరెడ్డి, భవాని ప్రసాద్, గన్ను, శివలింగం గౌడ్, శివశంకర్, చంద్రకాంత్ పాల్గొన్నారు.