calender_icon.png 3 April, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనిక్ స్పై డ్రామా చెనాపీస్

02-04-2025 12:00:00 AM

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్‌డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు అక్కి విశ్వనాథరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కమల్ కామ రాజు, రఘుబాబు, రంగస్థలం మహేశ్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం కథానాయకుడు నిహాల్ కోదాటిని పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో వాలి అనే పాత్రలో నటిస్తున్న నిహాల్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి డీవోపీ: సురేశ్ రగుతు; సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్; ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేశ్.