calender_icon.png 13 February, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1104 యూనియన్ ప్లాటినం జూబ్లీ వేడుకలు

13-02-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : టీఈఈ 1104 యూనియన్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలను 1104 యూనియన్ ఆధ్వర్యంలో రాష్ర్టవ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా కేటీపీ ఎస్ కాంప్లెక్స్‌లోని 1104 యూనియన్ ఆఫీస్ లో ఘనంగా వేడుకలను నిర్వహించారు. తొలుత కేటీపీఎస్ పాండురంగాపురం సెంటర్ నుండి ఉద్యోగులు ర్యాలీగా యూనియన్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు.

రాష్ర్ట కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ సంఘం సుధీర్  జెండా ఎగురవేసి, 75 వసంతాల కేకును కట్ చేశారు. సంఘానికి సేవలందించి పదవి విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులను సన్మానించారు. యూనియన్ 1950 ఫిబ్రవరిలో 12 తేదీ నుండి నేటి వరకు 1104 యూనియన్ సాధించిన విజయాలను, చేసిన కార్యక్రమాలను ఉద్యోగులు, కార్మికులతో పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి జెన్‌కో అధ్యక్షులు కేశబోయిన కోటేశ్వరరావు అధ్యక్షతన, ప్లాటినం జూబ్లీ కార్యక్రమానికి కేటీపీఎస్ రెండు రీజియన్ల ఉద్యోగులు, ఆర్టిజన్లు, మహిళా సోదరీమణులు, రెండు రీజియన్ల నాయకులు, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు, జెన్కో కార్యవర్గ సభ్యులు, హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.