వరద ప్రభావిత ప్రాంతాల్లో శివరాజ్‌సింగ్, బండి ఏరియల్ సర్వే
హైదరాబాద్,సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్‌లు శుక్రవారం ఖమ్మంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రుల పర్యటన ఉంటుంది. వరద నష్టంపై సాయంత్రం విజయవాడలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి ప్రత్యేక విమానంలో భోపాల్ వెళ్లనున్నారు. బండి సంజయ్ మాత్రం ఖమ్మం పట్టణంలో వివిధ వార్డుల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఖమ్మం నుంచి కోదాడకు వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. దెబ్బతిన్న పొలాలు, వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలతో ఆయన మాట్లాడనున్నారు.