హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రులు పరిశీలిస్తున్నారు. కేంద్రమంత్రులు వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో కేంద్రమంత్రులు ఏరియల్ సర్వే చేపట్టారు. కొట్టుకుపోయిన సాగర్ ఎడమ కాలువను కేంద్రమంత్రులు పరిశీలించారు. మధిరలో కట్టలేరు వరదలో ముంపునకు గురైన పొలాలను, ఖమ్మంలో మున్నేరు ఉద్ధృతితో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. రాష్ట్రంలో వదర పరిస్థితులపై కేంద్రమంత్రులు చిత్ర ప్రదర్శనను తిలకించారు.