calender_icon.png 15 January, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు రాష్ట్రంలో కేంద్రమంత్రి పర్యటన

05-09-2024 12:53:42 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 4(విజయక్రాంతి): భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతా ల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ రోజు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ బృందంతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సైతం రాష్ట్రానికి రానున్నట్లు రాష్ట్ర బీజేపీ నాయకులు తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులను ఆదుకునేందుకు కేంద్రం ఈ బృందాన్ని రాష్ట్రానికి పంపుతోంది.