calender_icon.png 21 September, 2024 | 8:34 AM

వరద బీభత్సం.. మోకాళ్లలోతు నీటిలో కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్

06-09-2024 10:36:59 AM

అమరావతి: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గురువారం విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీటిలో నడిచి సర్వే చేపట్టారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వరదలు సంభవించాయి, అనేక రోడ్లు, ఇళ్లు నీట మునిగాయి. కృష్ణానదికి వరద రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, పెద్దమనసుతో సాయం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను నారా లోకేష్ కోరాను. ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియా, వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రితో కలిసి పరిశీలించాను. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని వివరించాను. జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్ సింగ్ నగర్, అంబాపురం, విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బోటుపై వెళ్లి పరిశీలించామని తెలిపారు. వరద కారణంగా జరిగిన నష్టాన్ని త్వరితగతిన భర్తీ చేసేందుకు సాయం అందిస్తామని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారని లోకేష్ వెల్లడించారు.