ఖమ్మం, (విజయక్రాంతి): ఈరోజు ఖమ్మం జిల్లాలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. మధిర, ఎర్రుపాలెం , పాలేరు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తారు. అనంతరం పాలేరులో రైతులతో ముఖాముఖి మాట్లాడి, ఎగ్జిబిషన్ తిలకిస్తారు. తర్వాత రైతులనుద్దేశించి మాట్లాడతారు.