calender_icon.png 7 April, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా..

07-04-2025 05:22:08 PM

రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేంద్ర సహాయ మంత్రి సంజయ్..

హుజురాబాద్ (విజయక్రాంతి): ఇల్లందకుంట శ్రీ సీతా రామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట శ్రీ సీతా రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పట్టాభిషేకం సందర్భంగా శ్రీ సీత రామచంద్రస్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శ్రీ సీతారామచంద్రస్వామివారి దర్శించుకున్న అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అధికారులతో ఆలయ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.