calender_icon.png 25 October, 2024 | 3:52 AM

ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌తో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భేటీ

25-10-2024 12:00:00 AM

 వాషింగ్టన్:  అమెరికా వాషింగన్‌లో ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా తో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణల సహా పలు అంశాలపై చర్చించారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా నిర్మలా సీతారామన్, అజయ్ బంగా ప్రపంచ పబ్లిక్ గూడ్స్ ప్రైవేట్ క్యాపిటల్ భాగస్వామ్యం, ఇంధన భద్రత, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల  సంస్కరణలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

ప్రపంచ బ్యాంక్ తరపున భారతదేశం జీ-20 ప్రెసిడెన్సీ సమయంలో బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల సంస్కరణలపై ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ) సిఫారసులపై సాధించిన పురోగతి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు. భవిష్యత్తులో సిఫార్సుల అమలును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కోరారు.

2023 జీ-20 భారత్ ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో నియమించిన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ గ్రూప్.. బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల సంస్కరణ కోసం సిఫారసులు చేసింది. పేదరికాన్ని అంతం చేయడం, భాగస్వామ్య శ్రేయస్సును ప్రోత్సహించడం, 2030 నాటికి ప్రపంచ ప్రజా వస్తువుల కోసం స్థిరమైన రుణస్థాయిలను మూడురెట్లు పెంచేందుకు దోహదం చేయాలని..

బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల ఎజెండాలోని అంశాలకు మద్దతు ఇచ్చేందుకు ఇష్టపడే పెట్టుబడిదారులతో ఉద్దేశపూర్వకంగా పాల్గొనేందుకు అనువైన, వినూత్న మైన ఏర్పాట్లను అనుమతించే మూడో ఫైనాన్సింగ్ మెకానిజం రూపొందించాలని సిఫారసు చేసింది.

బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థ 80వ వార్షికోత్సవం సందర్భంగా చర్చించేందుకు ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సంయు క్తంగా నిర్వహించే కన్సల్టేటివ్ మెకానిజంపై విస్తృత సంప్రదింపుల ప్రక్రియ అవసరమని కేంద్రమంత్రి పేర్కొన్నారు.