calender_icon.png 23 October, 2024 | 7:03 PM

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదు: కేంద్రమంత్రి కుమారస్వామి

11-07-2024 04:02:07 PM

అమరావతి: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి పర్యటన ముగిసింది. గురువారం ఉదయం ఉక్కు కర్మాగారానికి చేరుకున్న ఆయన మూడు గంటలకు పైగా అధికారులతో సమావేశమయ్యారు. సమీక్షా సమావేశం అనంతరం హెచ్‌డి కుమార స్వామి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని చెప్పారు. ఇక్కడ గమనించిన ప్రతి అంశాన్ని ప్రధాని మోదీకి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు. పరిశ్రమ పునరుద్దరణకు ప్రధానికి నోట్‌ సమర్పిస్తానని పేర్కొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని అర్థమైందన్నారు. అధ్యయనం కోసం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు వచ్చినట్లు చెప్పిన కుమారస్వామి స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితిని ప్రధానికి నివేదిస్తానన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను పరిరక్షించడం తమ బాధ్యత అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై సమీక్షా సమావేశం నిర్వహించేందుకు కుమారస్వామి విశాఖపట్నం వచ్చారు. ఆయన నిన్న నగరానికి చేరుకుని విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ కార్పొరేట్‌ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) యాజమాన్యంతో సమావేశమయ్యారు.