calender_icon.png 14 October, 2024 | 5:57 PM

దేవాలయాలకు పూర్వవైభవం: కిషన్ రెడ్డి

14-10-2024 03:24:20 PM

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకం పరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోడీ ప్రధాని అయ్యాక ఆలయాల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. భద్రాచలం, రామప్ప, జోగులాంబ, బల్కంపేట ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. వెయ్యి స్తంభాల మండపంలో పూజా కార్యక్రమాలు ప్రారంభించామని చెప్పారు. దేశవ్యాప్తంగా 150 దేవాలయాలకు పూర్వవైభవం కల్పిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు యువత కూడా పెద్దసంఖ్యలో ఆలయాలకు వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతోందన్నారు. పెద్దలపై గౌరవం, దేశభక్తి, సమాజయంపై బాధ్యత పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మరింత అంకితభావం, చిత్తశుద్ధితో దైశాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిందని చెప్పిన కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో భద్రకాళి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.