ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ సదస్సుకు హాజరు
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో మంగళవారం జరుగను న్న ‘ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్’ లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రియాద్ వెళ్తున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు సోమవారం రాత్రి రియాద్ బయలుదేరతారు.
మంగళవారం నుంచి మూ డురోజుల పాటు రియాద్‌లో టువర్డ్స్ గ్రాండ్ అగ్రిమెంట్ థీమ్‌తో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఖనిజ వనరు ల అభివృద్ధి అంశంపై ఈ సందర్భం గా విస్తృతంగా చర్చించనున్నారు. అనంతరం వివిధ దేశాల బొగ్గు, గను ల శాఖ మంత్రులతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ద్వుపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు.
ఈ కాన్ఫరెన్స్‌లో ఆయా దేశాల మంత్రులు, కంపెనీల సీఈవో లు ప్రసంగించనున్నారు. ఖనిజ సంపదపై ఫలప్రదమైన చర్చ జరగడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖనిజ సంపద సద్వినియోగం అవ్వాలన్న లక్ష్యంతో సౌదీ అరేబియా వేదికగా మూడేళ్లుగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.