calender_icon.png 15 October, 2024 | 2:51 PM

Breaking News

రాడార్ స్టేషన్... దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టు

15-10-2024 11:50:10 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): దేశ రక్షణకు కీలకమైన రాడార్ స్టేషన్ పై బీఆర్ఎస్ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమోత్తారు. 2017లో రాడార్ కేంద్రానికి భూమి ఇచ్చేలా జీవో 44 విడుదల చేశారని వెల్లడించారు. 2010లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హయంలో ప్రతిపధించిన రాడార్ కేంద్రం ఇప్పటి వరకు అనేక విభాగాల్లో అనుమతులు పొందిందని స్పష్టం చేశారు. దామగుండం లో ఏర్పాటు చేయబోయే వేరి లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం సముద్రంలోని నౌకలకు ఉపయోగపడనుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశభద్రతకు సంబంధించిన ప్రాజెక్టు అని, రాడార్ స్టేషన్ రావడం మన రాష్ట్రానికి గర్వకారణం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

రాడార్ స్టేషన్ కు  కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతినిస్తూ జీవో కూడా జారీ చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. భూమి ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం బైసన్ పోలో గ్రౌండ్ లో లింక్ పెట్టిందని, బీఆర్ఎస్ ది.. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట..పతిపక్షంలో ఉన్నప్పుడు మరోమాట అని విరుచుకుపడ్డారు. చైనా సైనికులతో భారత బలగాలు ఘర్షణలో పారిపోయారని బీఆర్ఎస్ నేతలు మాట్లడారని కిషన్ రెడ్డి చెప్పారు. సర్జకల్ స్టైక్స్ పై బీఆర్ఎస్ నేతలు ఇష్ట్రం వచ్చినట్లు మాట్టాడారని ఆయన విమర్శించారు.  బీఆర్ఎస్ పాలనలో వారి కుటుంబసభ్యలను తప్ప మరేమీ పట్టించుకోలేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.