న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో సాంకేతికను ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంతో తెలిపారు. పర్యావరణహితంగా మైన్ క్లోజర్ కార్యకలాపాలు చేస్తామన్నారు. బొగ్గు వెలికితీత కార్మికుల రక్షణే తమ తొలి ప్రాధాన్యతన్నారు. కార్మికుల సంక్షేమంపై దృష్టి కేంద్రీకరించామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సంవత్సరం పాటు కోల్ ఇండియా 50 ఏళ్ల ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. 2025 అక్టోబర్ వరకు కోల్ ఇండియా 50 ఏళ్ల ఉత్సవాలు కొనసాగుతాయని వెల్లడించారు. 95 శాతం రాగిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని కేంద్రమంత్రి వెల్లడించారు. రాగి ఉత్పత్తిలో స్వావలంభన సాధించాలని ప్రధాని మోడీ ఆదేశించారని కిషన్ రెడ్డి చెప్పారు.