calender_icon.png 5 November, 2024 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు తేడా ఏమిటో..?: కిషన్ రెడ్డి

04-11-2024 01:20:02 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు అనేక హామీలిచ్చి కాంగ్రెస్ నేతలు మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలను వందరోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ పెద్దపెద్ద మాటలు చెప్పారని, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తియినా కూడా హామీల అమలు ఊసే లేదన్నారు.

కాంగ్రెస్ పాలనతో కర్ణాటక దివాలా తీసే పరిస్థితి వచ్చిందని, మోసపూరిత డిక్లరేషన్లతో ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పని అని విమర్శించారు. ఇచ్చిన హామీలను ప్రశ్నించే యువతను లాఠీలతో అణచివేస్తున్నారని, అశోక్ నగర్ ప్రాంతాన్ని పోలీసు నిర్భంధంలో పెట్టారు. బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు తేడా ఏమిటో చెప్పాలి..? అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.  అప్పులు తీర్చడం కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి తెచ్చారని ఎద్దేవా చేశఆరు.కొన్నాళ్లకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తోందన్నారు. అరకొర రుణమాఫీ చేసి రైతులను దగా చేశారు. వరికి రూ.500 బోనస్ అన్నారు.. ఇప్పుడు సన్నధాన్యానికే అంటున్నారుని కిషన్ రెడ్డి మండిపడ్డారు.