calender_icon.png 23 February, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

22-02-2025 10:26:30 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం.. అధికారం కోసం అలవి కాని, అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెసు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం చాయ్ పే చర్చ  కార్యక్రమంలో పాల్గొన్నారు. కౌన్సిల్ లో ప్రభుత్వ న్ని ప్రశ్నించేందుకు బీజేపీ మద్దతు ఇస్తున్న కొమురయ్య, అంజిరెడ్డి లను గెలిపించాలని కోరారు. బీజేపీ  ఎల్పీ నాయకులు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థుల,ఉపాద్యాయుల సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం ను నిలదీస్తాని ,ఆది‌లాబాద్ నిర్మల్ ఆర్మూర్ రైల్వే లైన్ మోడీ హయంలో పూర్తి కానుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గడం నగేష్ ,బీజేపీ జిల్లా అద్యక్షులు రితేష్ రాథోడ్ ,సుహాసిని రెడ్డి, రాంచందర్ రెడ్డి, హరి నాయక్ ,ఆకుల శ్రీనివాస్, పడాల రాజశేఖర్, నాయిని సంతోష్, అంకం మహేందర్, మంత్రరాజ్యం సురేష్, తదితరులు పాల్గొన్నారు