calender_icon.png 27 January, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటుడు బాలకృష్ణను కలిసిన కిషన్ రెడ్డి

26-01-2025 06:03:34 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారం కలిశారు. పద్మభూషన్ అవార్డుకు ఎంపికైన బాలకృష్ణ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... చలనచిత్ర పరిశ్రమకు బాలకృష్ణ చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసినందుకు కేంద్రానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఒక గొప్ప నటుడిగా ఉండటమే కాకుండా, ప్రజాసేవలో ఆయన చేసిన ప్రశంసనీయమైన ప్రయత్నాలు ఈ గుర్తింపును మరింత అర్హమైనవిగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.