calender_icon.png 18 October, 2024 | 2:48 PM

మూసీ సుందరీకరణను వ్యతిరేకించడం లేదు

18-10-2024 12:19:31 PM

సివరేజ్ లైన్ ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 


హైదరాబాద్: గాంధీనగర్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సివరేజ్ లైన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజ్ వ్యవస్థ విస్తరించాలని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ సరిపోకే రోడ్లపైకి మురికినీరు వస్తోందని కేంద్రంమంత్రి వెల్లడించారు. డ్రైనేజీ వ్యవస్థను దశలవారీగా అభివృద్ది చేయాలని ఆయన ఆదేశించారు. పలు చోట్ల డ్రైనేజీలో మంచినీళ్లు కలుస్తున్నాయని ఆరోపించారు. డ్రైనేజీ సమస్య పరిష్కరించకుండా మూసీ సుందరీకరణ జరగదన్నారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్స్క్ విభాగాలకు నిధుల కొరత ఉండకూడదని కిషన్ రెడ్డి సూచించారు. మూసీ సుందరీకరణను ఎవరూ వ్యతిరేకించడం లేదన్నారు. మూసీకి రెండు వైపులలా రిటైనింగ్ వాల్ కట్టి అభివృద్ధి చేయాలని కోరారు. 30 ఏళ్ల కింద కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చవద్దని కేంద్రమంత్రి ప్రభుత్వాన్ని కోరారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, నగదు ఇస్తామంటూ ఖాళీ చేయమనడం సరికాదని హితువు పలికారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా మూసీ సుందరీకరణ  చేపట్టాలని చెప్పారు.