calender_icon.png 14 November, 2024 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

10-11-2024 03:04:38 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): ఆసిఫ్‌నగర్ డివిజన్‌లోని దయాబాగ్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత అనేక సంవత్సరాలుగా నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా, కార్పొరేటర్లుగా మజ్లిస్ పార్టీ నేతృత్వం బీవహిస్తున్నదనీ అన్నారు. మజ్లిస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు పక్షపాతంతో వ్యవహరిస్తూ ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మజ్లిసేతర ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కూడా ప్రజలకు అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనీ విమర్శించారు. పార్లమెంటు సభ్యుడిగా బాధ్యతగా నాంపల్లి నియోజకవర్గ ప్రజలకు మేలు చేసేలా అనేక పనులు చేస్తున్నామనీ తెలిపారు. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్ల సాయంతో సుమారు రూ. 78 లక్షలతో కమ్యూనిటీ హాళ్లు, ఓపెన్ జిమ్స్, బోర్ వెల్స్.. ఇలా అనేక సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేస్తున్నట్టు చెప్పారు.

బస్తీ నాయకులు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా ముందుకురావాలన్నారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంటుకు నిధుల కొరత వేధిస్తున్నదనీ అన్నారు. కనీసం వీధి లైట్లు హ్యాండిల్ చేసే సిబ్బందికి కూడా జీతాలివ్వక పోవడంతో సమ్మెకు దిగారనీ తెలిపారు. హైదరాబాద్ నగరంలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వని కారణంగా కొత్త టెండర్లు తీసుకునే పరిస్థితి లేదన్నారు. నగరంలో అంబర్ పేట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి, గోషామహల్ వంటి ప్రాంతాల్లోని బస్తీల్లో నిధుల కొరతతో ప్రజలకు అన్యాయం జరుగుతున్నదనీ అన్నారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్లకు నిధుల కొరతతో అరకొర సౌకర్యాలతో పాఠశాలలు నడుస్తున్నాయని అన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.