calender_icon.png 2 January, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనేక ఒత్తిళ్ల మధ్య ప్రధానిగా మన్మోహన్ సింగ్

30-12-2024 06:23:13 PM

హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించాక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రేమ ఒలకబోస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) మండిపడ్డారు. మన్మోహన్ హయాంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ షాడో ప్రధానిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. షాడో కేబినెట్ గా పనిచేసి మన్మోహన్ ను రాహుల్ ఇబ్బంది పెట్టారని, మన్మోహన్ సింగ్ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని విమర్శించారు.

అదేవిధంగా అప్పటి కుంభకోణాలకు మన్మోహన్ సింగ్ కు సంబంధం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావును కూడా కాంగ్రెస్ పార్టీ  అవమానించిందని ఆరోపించారు. అలాగే పీవీకి బీజేపీ ప్రభుత్వం భారతరత్న(Bharat Ratna) ఇవ్వడం  సోనియా గాంధీ, రాహుల్ కు బాధగా ఉందని చెప్పారు. పీవీకి భారతరత్న ప్రధానం కార్యక్రమానికి సోనియా, రాహుల్ రాలేదని కిషన్ రెడ్డి వెల్లడించారు. మన్మోహన్ సింగ్ మరణంతో ప్రభుత్వం సంతాపదినాలు ప్రకటిస్తే రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు.