calender_icon.png 23 February, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు

23-02-2025 12:18:10 AM

కార్యచరణ అయినా సిద్ధం చేసి సీఎం చర్చకు రావాలి 

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

నిజామాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఇచ్చిన హామీలలో కనీసం 10% మహమీలైన నెరవేర్చి అప్పుడు చర్చకు రావాలని కేంద్ర మంత్రి తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. రాష్ట్రంలో గత 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒరగపెట్టిందేమీ లేదని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలలో ఇప్పటివరకు ఏ ఒక్క ఆమె కూడా పూర్తిగా నెరవేర్చలేదని ఎన్నికల హామీలు నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని కనీసం ఇప్పటివరకు ఇచ్చిన హామీల పథకాల కార్యాచరణ కూడా అమలులో రాలేదని ప్రాథమికంగా కార్యాచరణ నిర్ధారణ చేసిన తర్వాత అయినా చర్చలకు రావాలని కిషన్ రెడ్డి సూచించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఈ నేపథ్యంలో సీఎం చర్చకు పిలవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు నిజామాబాద్ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి కిషన్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన లో వంద రోజుల లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని 400 రోజులు దాటినా కూడా ఏ ఒక్క ఆమె కూడా పూర్తి చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినవని పట్టభద్రులందరూ బిజెపికి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బిజెపితో విజయమని కిషన్ రెడ్డి భీమా వ్యక్తం చేశారు. 

 మూడు దశాబ్దాల కల నెరవేర్చిన కేంద్రం

మూడు దశాబ్దాలుగా ఆచరణకు నోచుకోని పసుపు బోర్డు కలను నెరవేర్చిన ఘనత బిజెపి ప్రభుత్వానికి దక్కిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పసుపు బోర్డుకై నిరంతర కృషిచేసి తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని పసుపు బోర్డు ఏర్పాటుకై శ్రమించి పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పదవిని సైతం నిజామాబాద్ జిల్లాకు కట్టబెట్టిన ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి ఎంతో ఉందని ప్రధానమంత్రి సైతం ఒప్పించి ప్రకటన చేయించి పసుపుపొద్దు సాధించే వరకు కృషి చేశారని ఆయన కొనియాడారు. రానున్న రోజుల్లో పసుపు రైతులకు మేలు చేసే కార్యాచరణను పసుపు బోర్డు రూపొందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

 బీసీల కులగనకు బిజెపి వ్యతిరేకం కాదు

బీసీలకు బిజెపి అనుకూలమని కేంద్రమంత్రి మరోమారు స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను బీసీల లో కలపడం ఏమాత్రం సహించమని దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్య పై తమ పోరాటం కొనసాగుతుంద న్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ బిజెపిలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు సీఎం పిఎం స్థాయికి ఎదగగలుగుతారని కానీ ఈ అవకాశం బిజెపిలో మాత్రమే ఉంటుందని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఒక్క బీసీనీ  కూడా ముఖ్య మంత్రిని చేయగలిగిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు భారతీయ జనతా పార్టీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని ఆయన మరో మారు స్పష్టం చేశారు