15-04-2025 01:43:30 PM
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి(Telangana BJP President) ఎన్నికకు తొందరేమీ లేదని కేంద్రమంత్రి, బీజేపీ(Bharatiya Janata Party ) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు వారం రోజులు పట్టే అవకాశముందని చెప్పారు. కేరళ, తమిళనాడు అధ్యక్షులను ప్రకటించారని కేంద్రమంత్రి వివరించారు. జాతీయ అధ్యక్షుడి ప్రతిపాదనల్లో తన పేరు లేదని కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) స్పష్టం చేశారు. తమిళనాడులో ఎన్డీఏను పునరుద్ధరించాలని ఆయన ఆకాంక్షించారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఎక్కడైనా చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
భూములు, మద్యం విక్రయం, అప్పులతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. తాను జాతీయ అధ్యక్షుడు అనే ప్రతిపాదన ఏమీ లేదన్న కిషన్ రెడ్డి ఇప్పటివరకు దక్షిణాదిలో 2 రాష్ట్రాలకు మాత్రమే అధ్యక్ష ఎన్నికలు జరిగాయని తెలిపారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా బీజేపీ నిర్ణయం ఉంటుందన్నారు. భూముల అమ్మకంలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పోటీపడుతోందని సూచించారు. సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టులపై కట్టుబడి ఉన్నానని, హెచ్‌సీయూ భూముల్లో(HCU Lands Issue ) జంతువులు ఉన్నది అవాస్తవమా? అని ప్రశ్నించారు. హెచ్‌సీయూ భూముల వెనక బీజేపీ ఎంపీ ఉంటే పేరు బయటపెట్టండి.. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.