21-02-2025 10:38:35 PM
బైంసా (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం బైంసాకు రానున్నారని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలియజేశారు. సాయంత్రం 4 గంటలకు ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో నియోజకవర్గ కార్యకర్తలు, పట్టభద్రుల ఓటర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గోడం నగేష్ తో పాటు బిజెపి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు. సకాలంలో పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.