10-04-2025 02:31:17 AM
గయా, ఏప్రిల్ 9: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాం ఝీ మనుమరాలు సుష్మా దేవి (32) దారుణహత్యకు గురయ్యారు. భార్యభర్తల చిన్న పాటి ఘర్షణ సుష్మాదేవి హత్యకు దారి తీసింది. క్షణికావేశంలో ఆమె భర్త రమేశ్ తుపాకీతో కాల్పులు జరపడంతో అక్కడికక్క డే మృతి చెందింది.
ఈ ఘటన బీహార్‌లోని గయా జిల్లా టెటువా గ్రామంలో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. జితన్ రామ్ మనుమరాలు సుష్మా దేవి 14 ఏళ్ల క్రితం రమేశ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కులాంతర వివాహం కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. అప్పటి నుంచి వీరిద్దరు గయా జిల్లా టెటువాలోనే నివసిస్తున్నారు.
రమేశ్ ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తుండ గా.. సుష్మా వికాస్ మిత్రగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. ఇటీవల ఈ ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే రమేశ్ బుధవారం తన పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. వచ్చీ రాగానే సుష్మా ఏదో విషయమై రమేశ్‌తో గొడవకు దిగింది.
సహనం కోల్పో యిన రమేశ్ తన వద్ద ఉన్న నాటు తుపాకీని తీసుకొచ్చి సుష్మా దేవిపై కాల్పులు జరిపా డు. ఫలితంగా ఆమె అక్కడే మృతి చెందగా.. రమేశ్ ఘటనా స్థలి నుంచి పారిపోయాడు. తుపాకీ చప్పుడు వినిపించి బయటికొచ్చిన పిల్లలు, మృతురాలి సోదరి పూనమ్ గట్టిగా అరుస్తూ బయటకు వెళ్లారు.
విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొన సాగిస్తున్నారు. మృతదేహం పక్కనే నాటు తుపాకీ లభ్యమవగా దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేంద్ర మంత్రి మ నుమరాలు కావడంతో పోలీసులు ఈ కేసు ను సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడు రమేశ్‌ను గాలించేందుకు ముగ్గురు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు గయా ఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.