26-02-2025 01:19:44 AM
కాంగ్రెస్ ది పాకిస్థాన్ జట్టు: కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లో ఇండియా గెలిచింది... మాది ఇండియా జట్టు, ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్ ది పాకిస్తాన్ టీం అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి ఆంజయ్ అన్నారు. మంగళ వారం కరీంనగర్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో తెలంగాణలో ఇండియా టీం, పాకిస్తాన్ టీం మధ్య మ్యా జరగబోతోందన్నారు. ఇండియా గెలవాలనుకుంటే బీజేపీకి ఓటేయండన్నారు.
పాకిస్తాన్ గెలవాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటేయండన్నారు. బీజేపీ గెలిస్తే పట్టభద్రుల, టీచర్ల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. కుల గణనకు మేం వ్యతిరేకం కానేకాదని, బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని వ్య తిరేకిస్తున్నామన్నారు. తెలంగాణలోనూ ఎ ప్పటి నుండో దూదేకుల కులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, మేం ఏనాడూ అభ్యంతర పెట్టలేదన్నారు. అయితే 12.5 శాతం జనాభా ఉన్న ముస్లిం జనాభాలో 8.8 శాతం మందిని బీసీల్లో కలుపుతామం టే ఎందుకు ఒప్పుకుంటామన్నారు.
నూటికి 88 మందికిపైగా ముస్లింలను బీసీల్లో కలిపి నిజమైన బీసీల పొట్టకొడతారా అన్నారు. ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి బిల్లు పంపితే ఎందుకు ఆమోదించాలన్నారు .60 లక్షల మంది బీసీల జనాభా ఎట్లా తగ్గిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 56 శాతం జనాభా ఉందని నాటి మంత్రులు కేటీఆర్, హరీష్ అసెంబ్లీలో చెబితే ఎందుకు అభ్యంతరం చెప్పలేదన్నారు.
కాంగ్రెస్ 14 నెలల పా లన బాగుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను తీసుకునేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నిరు ద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, డీఏలు, జిపిఎఫ్ సొమ్ము, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఫీజు రి యంబర్స్మెంట్ ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని పట్టభద్రులు, ఉద్యోగులు ఆశించారని, కానీ వారిని సీఎం నిరాశపరిచారని అన్నా రు. నన్ను రాష్ర్ట అధ్యక్ష పదవి నుంచి తప్పిం చి బీసీలకు అన్యాయం చేశారని అబద్దమని, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా ప్రమోషన్ వచ్చిందన్నారు.