హైదరాబాద్: నారాయణపేటలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) గురువారం పర్యటించారు. కలెక్టరేట్ లో సమీక్ష సమావేశంలో బండి సంజయ్, డి.కె అరుణ పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు బండి సంజయ్, అరుణ సంఘీభావం ప్రకటించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుతామని బండి సంజయ్ పేర్కొన్నారు.