హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రొఫెసర్ శేషగిరిరావు ఇంటికి వెళ్లనున్నారు. సాయంత్రం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ తలసాని శ్రీనివాస్ కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే..