calender_icon.png 31 January, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర మంత్రి బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి

29-01-2025 12:00:00 AM

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్

సూర్యాపేట, జనవరి 28 : కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ఇందిరా గాంధీ, గద్దర్ పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వాఖ్యలు సరికావని ఆయన నోరు  అదుపు లో పెట్టుకోవాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, తాజా మాజీ కౌన్సిలర్ ఎలిమినే టి అభినయ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటి పిలుపుతో మంగళవారం జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరు, పోటోతో ఇందిరమ్మ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందిస్తుంటే బిజెపి నాయకులు ఓర్వలేకపోతున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రజా యుద్ద నౌక గద్దర్ పట్ల ఆయన మాట్లాడిన తీరు సరైంది కాదన్నారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, నియోజకవర్గ అధ్యక్షులు జావిద్ బేగ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బొడ్డు సాయి, నాయకులు పాల్గొన్నారు.