calender_icon.png 23 March, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో కలిసి ఉంటారు.. గల్లీలో కొట్లాడుకుంటారు

22-03-2025 02:06:00 PM

డీలిమిటేషన్ పై కలిసిన వారంతా దొంగల ముఠానే

హైదరాబాద్: వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) ప్రభుత్వాన్ని కోరారు. గతంలో సమీక్షలు, సర్వేలు, నివేదికల పేరతో కాలం గడిపారని ఆరోపించారు. గత పేదేళ్లలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని బండి సంజయ్ వివర్శించారు. కాంగ్రెస్ హయాంలోనూ రైతులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. డీలిమిటేషన్ పై కలిసిన వారంతా దొంగల మూఠానేనన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే అన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ సహకరిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కలిసి ఉంటారు.. గల్లీలో కొట్లాడుతకుంటారని ఎద్దేవా చేశారు.

డీఎంకే భేటీకి రెండు పార్టీలు వెళ్లాయంటే.. ఇద్దరూ ఒక్కటా? కాదా? అని ప్రశ్నించారు. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక్క నోటీసు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడుతున్నారని పేర్కొన్నారు.  డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు.. ఆరు గ్యారంటీల హామీల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చెప్పారు. తమిళనాడులో డీఎంకే రూ. వెయ్యి కోట్లు మద్యం కుంభకోణం చేసిందంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. అవినీతికి పాల్పడిన డీఎంకేను సాగనంపేందుకు తమిళనాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు పక్కా ప్రణాళికతో ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ అధ్యక్ష పదవిపై బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తాను బీజేపీ అధ్యక్ష రేసులో లేనన్న బండి సంజయ్ ఇస్తే వద్దన్నానని తెలిపారు. ఇప్పటికే అధ్యక్షుడిగా తానేంటోని రూపించుకున్నాని స్పష్టం చేశారు. కొంత మంది వ్యక్తులు అధ్యక్షులం అవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించిన ఆయన ఇలా ప్రచారం చేసుకోవడం పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకం అన్నారు. కార్యకర్తలను కన్య్ఫూజ్ చేయవద్దు.. పార్టీ పెద్దలు అధ్యక్షుడిని నిర్ణయిస్తారు.. నేను కేంద్ర సహాయమంత్రిగా ఉన్నానని బండి సంజయ్ తెలిపారు.